ప్రమాదంలో ఉత్తర భారత నగరాలు

10 Nov, 2017 08:45 IST|Sakshi
వాతావరణ కాలుష్యంపై అమెరికా అంతరిక్ష పరిశోధాన సంస్థ నాసా విడుదల చేసిన చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : శత్రుదేశాల భయంకన్నా.. వాతావరణ కాలుష్యమే భారతీయ నగరాలను భీకరంగా వణికిస్తోంది. పాకిస్తాన్‌ అణు దాడికన్నా గాలి కాలుష్యమే భారతీయులను దారుణంగా పొట్టన పెట్టుకునేలా ఉంది. దేశం రాజధానిలో ఆవరించిన పొగమంచు, కాలుష్యం అందరికీ తెలిసిందే. ఇదొక్క ఢిల్లీకే పరిమితం కాకుండా పలు ఉత్తర భారతీయ నగరాలపై పంజా విసురుతోంది.

నగరాలు.. కాలుష్య కాసారాలు
దేశ రాజధాని ఢిల్లీతో పాటు, పట్నా, కాన్పూర్‌, లక్నో, మొరాదాబాద్‌, జైపూర్‌, హౌరా వంటి నగరాలపై వాయు కాలుష్యం పడగలు చాస్తోంది. గత మంగళవారం నాడు ఢిల్లీలో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఏక్యూఐ) 448 సూచిస్తోంది. ఇదే ఉత్తర్‌ ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో 500 తాకింది.  ఆయా నగరాల్లో గాలి నాణ్యత అత్యంత కనిష్టానికి చేరింది. గడచిన వారం రోజులుగా మొరాబాదాబద్‌లో గాలి నాణ్యత 450 నుంచి 500 మధ్యలోనే ఉంటోంది.

భయపడాల్సిన పని లేదు
మరో వారం రోజుల్లో ఢిల్లీ, మొరాదాబాద్‌ నగరాల్లో వాతావరణ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్‌ ప్రకటించారు. వాయు కాలుష్యాన్ని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ప్రమాదపు అంచుల్లో నగరాలు
గంగాతీర మైదానంలో ఉన్న ఉత్తర భారత ప్రధాన నగరాలపై వాయు కాలుష్య ప్రభావం అధికంగా ఉందని నాసా తెలిపింది.  ప్రధానంగా లక్నో, ఆగ్రా, కాన్పూర్‌, ముజఫర్‌పూర్‌, పట్నా వంటి నగరాలపై వాము కాలుష్య ప్రభావం అత్యంత తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు