ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం

3 May, 2018 13:49 IST|Sakshi

ఛత్తీస్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రలలో మరోసారి మావోయిస్టుల కలకలం రేపారు. ఛత్తీస్‌గడ్‌లోని  బీజాపూర్‌ జిల్లా అవుపల్లి ధారావరం ప్రధాన రహదారిలో చెట్లను నరికి పడేసి రోడ్డును దిగ్భంధించారు. మరోవైపు మహారాష్ట్ర గడ్చిరోలి పరిధిలోని పెరిమిలి అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోల పోస్టర్లు వెలిశాయి.

గత కొంతకాలంగా మావోయిస్టులపై జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లకు ప్రతీకారం తీర్చుకుంటామనే హెచ్చరికలు పోస్టర్లలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరురాష్ట్రాల సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. తాజాగా మావోయిస్టుల చర్యలతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.

మరిన్ని వార్తలు