భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు జవాన్లు మృతి

4 Apr, 2019 16:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు, భద్రత బలగాల మధ్య గురువారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు ప్రాణాలను కోల్పోయారు.  ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లాలో ఈ ఘటన ​చోటుచేసుకుంది.  భద్రత బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర పోరాటంలో నలుగురు జవాన్లు అమరులవ్వగా, మరో ఇద్దరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

యాంటీ నక్సల్స్‌ ఆపరేషన్స్‌ డీఐజీ పీ సుందరాజ్‌ మాట్లాడుతూ.. 114వ బెటాలియన్‌కు చెందిన జవాన్లు ఎన్నికల నేపథ్యంలో కాంకేర్‌ జిల్లా పరిసర ప్రాంతాల్లో కూంబింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారని, దీంతో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పు​​​​​లు జరిగాయని తెలిపారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు చనిపోగా, మరో ఇద్దరు గాయపడ్డారని  ధ్రువీకరించారు.  గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని, కాల్పులకు దిగిన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నమని ఆయన తెలిపారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు