గన్‌ వదిలి పెన్‌ పట్టిన మావోయిస్టులు

23 Jun, 2018 12:28 IST|Sakshi
ఇగ్నో ఎంట్రన్స్‌ పరీక్ష రాస్తున్న మావోయిస్టులు

ఇగ్నో డిగ్రీ ఎంట్రన్స్‌కు హాజరు

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జల్లాలో ఎస్పీ జోగ్గామోహన్‌ మిన్నా చొరవ మేరకు మావోయిస్టులు దళం వీడి జనజీవన స్రవంతిలో కలిసి గన్నులు వదిలిపెట్టి పెన్నులు చేతబట్టారు. 107మంది మావోయిస్టులు ఎస్పీ ఎదుట లొంగిపోయిన విషయం విదితమే.

వారంతా ఎస్పీ ఆధ్వర్యంలో బ్యాచిలర్‌ ప్రిపరేషన్‌ ప్రోగ్రాం(బీపీపీ) కోర్సు పూర్తిచేసి  బీఏ, బీకామ్‌లలో డిగ్రీ ప్రవేశాల కోసం శుక్రవారం ఎంట్రన్స్‌ పరీక్ష రాశారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైతే వారంతా డిగ్రీలు పూర్తి చేయగలుగుతారని ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ(ఇగ్నో) రీజనల్‌ డైరెక్టర్‌ ఆర్‌. రాజగోపాల్‌ తెలిపారు.

ఉత్తీర్ణులైన వారందరికీ డిగ్రీ కోర్సు ఉచితంగా చదివిస్తామని ఆయన చెప్పారు. బీపీపీ కోర్సు పూర్తి చేసిన వీరికి ఈ నెల రెండవ తేదీన ఒక పరీక్ష అయింది. శుక్రవారం మరో పరీక్ష నిర్వహించారు.  వీరిని ఆదర్శంగా తీసుకుని మావోయిస్టులు గన్‌లు వదిలిపెడితే మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. దళం వదిలి రండి. చైతన్య వంతులు కండి అని పిలుపునిచ్చారు.   

మరిన్ని వార్తలు