'భార్యపై బలత్కారం తప్పే'

24 Jun, 2015 19:16 IST|Sakshi
'భార్యపై బలత్కారం తప్పే'

న్యూఢిల్లీ: భార్యపై బలాత్కారం (మారిటల్ రేప్) ఖండించదగిన చర్య అని బీజేపీ నేత, కేంద్ర మంత్రి మేనకాగాంధీ అన్నారు. మహిళ ఇష్టాలకు వ్యతిరేకంగా ప్రవర్తించేది భర్త అయినా అది నేరమేనని చెప్పారు. ఓ పక్క వైవాహిక జీవితానికి సంబంధించిన సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఉన్న భారత దేశంలో మారిటల్ రేప్ అనేది పరిగణించదగినది కాదని ఇప్పటికే కోర్టు స్పష్టం చేయడంతోపాటు.. కేంద్రం కూడా దానిని ఆమోదించిన విషయం తెలిసిందే.

అప్పటి నుంచి పలు మహిళా సంఘాలు ఈ అంశంపై పెదవి విరుస్తునే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి మేనకా గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 'కేవలం సంబంధం లేనివారు మాత్రమే మహిళలను వేధింపులకు గురిచేస్తే ఒక నేరంగా పరిగణించకూడదనేది నా అభిప్రాయం. భార్యకు ఇష్టం లేకున్నా బలవంతగా లొంగదీసుకోవడం అనేది పురుషుడి ఆధిక్యతకు ప్రదర్శించుకునేందుకు, బానిసగా మార్చుకునేందుకు చేసే చర్య. అలాంటప్పుడు దానిని తీవ్రమైన చర్యగానే పరిగణించాలి' అని మేనకా గాంధీ ఓ టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

మరిన్ని వార్తలు