సినిమా తరహాలో ట్విస్టుల మీద ట్విస్టులు

27 Apr, 2017 21:17 IST|Sakshi
సినిమా తరహాలో ట్విస్టుల మీద ట్విస్టులు

ముజఫర్‌నగర్‌: పెళ్లి విందులో మాంసం వడ్డించడం లేదని ఏకంగా పెళ్లినే రద్దు చేసుకున్నారు. ఈ నిర్ణయం నాటకీయ మలుపులకు కారణమైంది. ఉత్తరప్రదేశ్‌ లోని ముజఫర్‌పూర్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. రిజ్వాన్‌ అనే యువకుడికి నగ్మా అనే యువతితో బుధవారం సాయంత్రం వివాహం జరగాల్సి ఉంది. అయితే, పెళ్లి విందులో మాంసాహారం లేదని అలిగిన వరుడి తరఫు వారు ముందు గొడవకు దిగారు. ఆపై ఏకంగా పెళ్లినే రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు.

బుధవారం సాయంత్రం వధువు గ్రామంలో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. చివరికి శాకాహార విందుతో వివాహం జరిగేలా ఒప్పించగలిగారు. అయితే, వధువు నగ్మా మాత్రం అందుకు అంగీకరించలేదు. ఈ పెళ్లికి ససేమిరా అంది. అదే సమయంలో గ్రామానికే చెందిన మరో యువకుడు ఆమెను పెళ్లాడతానంటూ ముందుకువచ్చాడు. అందుకు వధువు, ఆమె కుటుంబీకులు ఓకే చెప్పటంతో గ్రామ పెద్దల సమక్షంలోనే వారి వివాహం జరిపించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు