పటాసులు అవసరమా?

12 Oct, 2017 18:09 IST|Sakshi

క్రాకర్స్‌ బ్యాన్‌ను సమర్థించిన డిజైనర్‌ మసాబా గుప్త

మసాబా ఘాటుగా మాధానం చెప్పిన చేతన్‌ భగత్‌

సాక్షి, న్యూఢిల్లీ : నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌, ఢిల్లీలో సుప్రీంకోర్టు బాణాసంచాను నిషేధించడాన్ని ప్రముఖ డిజైనర్‌ మసాబా గుప్త సమర్థించారు. సుప్రీంకోర్టు నిర్ణయంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు బిన్నరకాలుగా స్పందించారు. రెండు రోజుల కిందట సుప్రీం నిర్ణయంపై ప్రముఖ రచయిత చేతన్‌ భగత్‌ వ్యంగ్యంగా స్పందించిన విషయం తెలిసిందే. చేతన్‌ భగత్‌ వ్యాఖ్యలపై మసాబా గుప్త విభిన్నంగా స్పందించింది. ‘‘నేను దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాను. దేశాన్ని ప్రేమించే వాళ్లంతా ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నాను’’ అంటే మసాబా ట్విటర్‌లో ట్వీట్‌ చేశారు. డిజైనర్‌ మసాబా గుప్త..  ప్రముఖ వెస్టిండీస్‌ క్రీడాకారుడు వివ్‌ రిచర్ట్స్‌, నీనా గుప్తల కుమార్తె. మసాబా ట్వీట్‌పై  చేతన్‌ భగత్‌ వ్యంగ్య కామెంట్లు చేశారు. నేను అత్యంత స్ఫూర్తివంతమైన వ్యక్తిని నేడు కలిశాను అంటూ ట్వీట్‌ చేశారు. చేతన్‌ ట్వీట్‌కు భారీగా రెస్పాన్స్‌ వస్తోంది.

మరిన్ని వార్తలు