రైల్వే, బ్యాంకులపైనే ఎక్కువ ఫిర్యాదులు

10 Apr, 2018 03:40 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు, రైల్వేల మీదనే అవినీతికి సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌(సీవీసీ) తన తాజా నివేదికలో వెల్లడించింది. 2016తో పోలిస్తే 2017లో తమకు అందిన అవినీతి ఫిర్యాదుల సంఖ్య 52 శాతం తగ్గిందని పేర్కొంది. 2017కి సంబంధించిన వార్షిక నివేదికను ఇటీవల పార్లమెంట్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

నివేదిక ప్రకారం.. గత ఏడాది మొత్తం 23,609 ఫిర్యాదులు అందాయి. 2016లో ఫిర్యాదుల సంఖ్య 49,847గా ఉంది. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి చీఫ్‌ విజిలెన్స్‌ అధికారులకు అందిన ఫిర్యాదుల సంఖ్య 60 వేలకుపైనే ఉంది. వీటిలో అధికంగా రైల్వే ఉద్యోగులపై 12,089 ఫిర్యాదులు అందాయి. ఇందులో 9,575 ఫిర్యాదులను పరిష్కరించారు. రైల్వే ఉద్యోగులపై వచ్చిన 1,037 ఫిర్యాదులు 6 నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి. వివిధ బ్యాంకుల అధికారులకు వ్యతిరేకంగా 8,018 ఫిర్యాదులు అందాయి.

మరిన్ని వార్తలు