వాట్సాప్‌ సాయం..రైళ్లో ప్రసవం

11 Apr, 2017 02:36 IST|Sakshi
వాట్సాప్‌ సాయం..రైళ్లో ప్రసవం

నాగ్‌పూర్‌: ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి రైలులో మహిళ ప్రసవించడానికి సాయపడ్డాడు. ఇందుకోసం వాట్సాప్‌ ద్వారా సీనియర్‌ డాక్టర్ల సాయం తీసుకున్నాడు. 24 ఏళ్ల విపిన్‌ ఖడ్సే ప్రస్తుతం నాగ్‌పూర్‌లోని ప్రభుత్వాసుపత్రిలో శిక్షణలో ఉన్నాడు.

అహ్మదాబాద్‌ నుంచి రాయ్‌పూర్‌ వెళ్లడానికి రోజు కూలీలైన చిత్రలేఖ, ఆమె భర్త శుక్రవారం అహ్మదాబాద్‌–పూరీ రైలెక్కారు. నిండు గర్భిణి అయిన చిత్రలేఖకు రైల్లోనే నొప్పులొచ్చాయి. ఆ రైళ్లోనే విపిన్‌ ప్రయాణిస్తుండటం, ఇతర సీనియర్‌ వైద్యులెవరూ అందుబాటులో లేకపోవడంతో విపిన్‌ ఖడ్సేనే ఆమెకు కాన్పు చేశారు. ప్రయాణికుల్లోని ఓ నర్సు కూడా అతనికి సాయం చేశారు. సాధారణ కాన్పు జరగక, ప్రసవంలో సమస్య తలెత్తడంతో ఖడ్సే వాట్సాప్‌ ద్వారా సీనియర్‌ డాక్టర్ల సలహాతో చికిత్స నిర్వహించారు.

మరిన్ని వార్తలు