మోదీ విదేశీ పర్యటనల ఖర్చు ఎంతో తెలుసా?

4 Mar, 2020 17:54 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గత ఐదేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు రూ 446.52 కోట్లు వెచ్చించినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. చార్టర్డ్‌ విమానాలతో కలిపి ఇంత మొత్తం ఖర్చయిందని లోక్‌సభలో విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి మురళీధరన్‌ ఓ ప్రశ్నకు బదులిస్తూ తెలిపారు. ఇక 2015-16లో రూ 121.85 కోట్లు, 2016-17లో రూ 78.52 కోట్లు ప్రధాని విదేశీ పర్యటనలకు ప్రభుత్వం వెచ్చించిందని చెప్పారు. 2017-18లో ఈ వ్యయం రూ 99.90 కోట్లు కాగా, 2018-19లో రూ 100 కోట్లు, 2019-20లో రూ 46.43 కోట్లు ప్రధాని విదేశీ పర్యటనలకు ఖర్చయిందని మంత్రి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలపై భారీగా ఖర్చు పెడుతున్నారన్న విపక్షాల విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించడం గమనార్హం. 

చదవండి : హోలీ వేడుకలకు దూరంగా ఉందాం!

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా