సీఏఏ నిరసన సెగలు: జర్నలిస్టులపై దాడి

16 Dec, 2019 16:41 IST|Sakshi

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లు (సీఏఏ)కు వ్యతిరేకంగా సోమవారం కూడా ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ వద్ద నిరసనలు కొనసాగాయి. యూనివర్సిటీ గేట్‌-1 వద్ద విద్యార్థుల నిరసనలను కవర్‌ చేస్తుండగా ఇద్దరు జర్నలిస్టులపై కొందరు గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. ఏఎన్‌ఐ వార్తాసంస్థకు చెందిన రిపోర్టర్‌ ఉజ్వల్‌ రాయ్‌, కెమెరాపర్సన్‌ సరబ్‌జీత్‌ సింగ్‌పై కొందరు దాడి చేయడంతో వారికి గాయాలయ్యాయి. దీంతో వారిని ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. జర్నలిస్టులపై దాడిని ఢిల్లీ పోలీసుశాఖ అధికార ప్రతినిధి ఎంఎస్‌ రాంధ్వా ఖండించారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించి కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరోవైపు జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ వద్ద ఉన్న మెట్రో స్టేషన్‌ ఎంట్రీ, ఎగ్జిట్‌ గేట్లను మూసివేస్తున్నట్టు ఢిల్లీ మెట్రో కార్పొరేషన్‌ ప్రకటించింది. ఆ స్టేషన్‌ వద్ద మెట్రో రైళ్లను ఆపడం లేదని తెలిపింది. విద్యార్థుల ఆందోళనలు, హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

మరిన్ని వార్తలు