డ్రైవర్‌కు ఓనం బంపర్‌ లాటరీ

23 Sep, 2017 17:57 IST|Sakshi

మల్లప్పురం: కేరళకు చెందిన   ముస్తఫా బంపర్‌ ఆఫర్‌ కొట్టేశారు.  కేరళ రాష్ట్ర ప్రభుత్వం  నిర్వహించే ఓనం బంపర్ లాటరీ లోరూ 10కోట్లను దక్కించుకున్నాడు.  పరప్పనాన్‌గడి సమీపంలోని మూనినియూర్ కు చెందిన ముస్తఫా  మూత్తరమ్మాళ్‌ (48) ఈ  ప్రభుత్వం నిర్వహించే ఓనం లాటరీ ప్రథమ బహుతి గెల్చుకున్నారు. దీని విలువ రూ. 10కోట్లు.  శుక్రవారం నిర్వహించిన డ్రాలో  బంపర్ బహుమతి విజేతగా నిలిచారు. దీంతో శనివారం  ఫెడరల్ బ్యాంక్ మేనేజర్‌ కు   టికెట్‌ ను (AJ2876) ముస్తఫా  అందజేశారు.

దీంతో ముస్తఫా కుటుంబంలో  దసరా సంబరాలు, వేలదివ్వెల దీపావళి  కాంతులు  ఒక్కసారిగా విరజిల్లాయి.  అటు గ్రామస్తులతో  ముస్తఫా సెల్ఫీల జోరు సాగింది.

ఐదుగురు సభ్యులతో కూడిన మధ్యతరగతి కుటుంబానికి చెందిన ముస్తఫా, పికప్ వాన్ డ్రైవర్గా పని చేస్తున్నాడు . తన తండ్రి మరణించిన తరువాత కొబ్బరి వ్యాపారాన్ని చేపట్టాడు.   ఈ  సొమ్ముతో కొబ్బరి కాయల వ్యాపారాన్ని విస్తరించడంతోపాటు, సొంత ఇల్లు కట్టుకోవాలని యోచిస్తున్నాడు. తాను ఇరవై సంవత్సరాల నుంచి  లాటరీ టిక్కెట్లను కొనటం మొదలుపెట్టాననీ, ఇపుడు  ఓనం బంపర్ టికెట్ బహుమతి  గెల్చుకోవడం సంతోషంగా ఉందని ముస్తఫా చెప్పారు.  అయితే   బహుమతి  సొమ్ములో కోటి రూపాయలు కమిషన్‌ టికెట్‌ అమ్మిన ఏజెంట్‌కు దక్కనుందని తెలుస్తోంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా