బాలికల విద‍్యపై ఢిల్లీలో సమావేశం

15 Jan, 2018 12:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల మంత్రి జ‌వ‌దేకర్ అధ్యక్షతన సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భ‌వ‌న్‌లో 65వ‌ సెంట్రల్ అడ్వైజ‌రీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేష‌న్ స‌మావేశం ప్రారంభమైంది. ఈ సదస్సు రెండు రోజులపాటు జరగనుంది. ఈ భేటీలో నాలుగు సబ్‌కమిటీలు ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నాయి.

తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పాల్గొన్నారు. బాలికల విద్యా నిష్పత్తిపై కడియం కమిటీ ప్రజెంటేషన్‌ ఇచ్చింది. 'స్టేట‌స్ ఆఫ్ గర్ల్స్‌ ఎడ్యుకేష‌న్ ఇన్ భార‌త్' క‌మిటీకి చైర్మన్‌గా కడియం శ్రీహరి ఉన్నారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ దేశంలో బాలిక‌ల‌ డ్రాప్ అవుట్‌కు గల కార‌ణాల‌పై అధ్యయనం చేసినట్లు చెప్పారు. విద్యతో పాటు బాలికలు ఎదుగే క్రమంలో ఆరోగ్యంపై దృష్టిసారించాలని అన్నారు. బాలికలు, వారి తల్లిదండ్రులు రెసిడెన్షియల్‌ స్కూళ్ల వైపే మొగ్గుచూపుతున్నారని మంత్రి పేర్కొన్నారు. గురుకుల పాఠశాలలు ఏర్పాటే తమ ప్రజెంటేషన్‌లో ప్రధాన అంశమని, రెసిడెన్షియల్‌ స్కూళ్ల ఏర్పాటులో తెలంగాణ రాష్ట్రమే ఉదాహరణ అని కడియం వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు