మార్చి 31 నుంచి వారు సామాన్యులు..

20 Feb, 2020 10:40 IST|Sakshi

లండన్‌ : బ్రిటన్‌ రాజు ప్రిన్స్‌ హ్యారీ ఆయన భార్య మేఘన్‌ మార్కెల్‌ మార్చి 31 నుంచి రాజ కుటుంబంతో సంబంధాలు అధికారికంగా పూర్తిగా తెగతెంపులవుతాయని దంపతుల కార్యాలయం వెల్లడించింది. ప్రిన్స్‌ హ్యారీ, మేఘన్‌లు రాజరిక విధుల నుండి వైదొలగాలని నిర్ణయించుకున్న తరువాత బకింగ్‌హామ్ ప్యాలెస్ డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ సస్సెక్స్ యొక్క "సస్సెక్స్ రాయల్" హోదాను సమీక్షించే క్రమంలో ప్రిన్స్‌ కపుల్‌ ఈ విషయం వెల్లడించడం గమనార్హం. రాజకుటుంబం నుంచి తాము దూరమవుతామని ఈ ఏడాది జనవరిలో ప్రిన్స్‌ దంపతులు ప్రకటించడం బ్రిటన్‌లో కలకలం రేపింది.

ప్రశాంత జీవనం గడిపేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ప్రిన్స్‌హ్యారీ అప్పట్లో ప్రకటించారు. తాను పుట్టినప్పటి నుంచి తాను ఎక్కడికి వెళ్లినా తనను ఫోటోగ్రాఫర్లు వెంబడించడం, కెమెరాలలో బంధించడం, తన గురించి జర్నలిస్టులు రాయడంతో విసిగిపోయానని చెప్పుకొచ్చారు. మరోవైపు రాజప్రాసాదాన్ని వీడటంతో వారు ఇక రాయల్‌ హైనెస్‌ హోదాను కోల్పోతారని, వారు మనసు మార్చుకుని భవిష్యత్‌లో రాజప్రాసాదంలోకి అడుగుపెడితే ఆ హోదాలు తిరిగి వర్తించే అవకాశం ఉందని బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ పేర్కొంది. హ్యారీస్‌ దివంగత ల్లి డయానా ప్రిన్స్‌ చార్లెస్‌తో విడాకులు పొందినపుడు ఆమె రాయల్‌ హైనెస్‌ హోదాను తొలగించారు.

చదవండి : ప్రిన్స్‌ హ్యారీ దంపతుల భద్రతా ఖర్చుకు ‘నో’

మరిన్ని వార్తలు