‘ఈవీఎంలపై ఈసీ మౌనం’

21 May, 2019 15:42 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఈవీఎంల అక్రమాలపై స్పష్టమైన ఆధారాలున్నా ఈసీ మౌనంగా వ్యవహరించడం ఆవేదన కలిగిస్తోందని పీడీపీ చీఫ్‌ మెహబూబా ముఫ్తీ అన్నారు. ఈవీఎంలపై పలు సందేహాలు వెల్లడవుతున్నా ఈసీ వివరణ ఇవ్వకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. ఈవీఎంలను మేనేజ్‌ చేయడం తర్వాత ఎగ్జిట్‌ పోల్స్‌ను వ్యూహాత్మకంగా వెల్లడించడం చూస్తుంటే మరో బాలాకోట్‌ తతంగాన్ని నడిపిస్తున్నట్టు కనిపిస్తోందని మెహబూబా ముఫ్తీ ట్వీట్‌ చేశారు.

ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు అనుగుణంగా సార్వత్రిక సమరంలో బీజేపీ గెలుపొంది మళ్లీ అధికారంలోకి వచ్చినా మంచి కోసం ప్రజలు జరిపే పోరాటం ఆగరాదని అన్నారు. బీజేపీ గెలుపు ఓటములతో ప్రపంచం​ఆగిపోదని, వ్యవస్ధలను నిర్వీర్యం చేయడం, సమగ్రతను దెబ్బతీయడం వంటి విపరిణామాలకు వ్యతిరేకంగా సమాజం, జర్నలిస్టులు నిబద్ధతతో​నిలబడి పోరాటం కొనసాగించాలని ఆమె ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు