'దోషులను శిక్షిస్తాం.. శాంతించండి'

18 Apr, 2016 16:58 IST|Sakshi
'దోషులను శిక్షిస్తాం.. శాంతించండి'

జమ్మూ: ఓ యువతిపట్ల ఆర్మీ జవాన్ అసభ్యంగా ప్రవర్తించాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని ప్రారంభమైన నిరసనలు తీవ్రరూపందాల్చడంతో పదిరోజుల పాటు కశ్మీర్ లోయ అతలాకుతలమైంది. ఈ నేపథ్యంలో ప్రజలు శాంతియుతంగా ఉండాలని, అల్లర్లకు పాల్పడవద్దని జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం జమ్ములో మాట్లాడిన ఆమె.. హంద్వారా, కుప్వారా జిల్లాల్లో పోలీసుల కాల్పుల్లో పౌరులు మరణించిన సంఘటనలపై విచారణ చేపడతామని, దోషులను శిక్షిస్తామని అన్నారు.

కశ్మీర్ లోయలో అల్లర్ల వెనుక విదేశీ శక్తుల ప్రమేయం ఉందని, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో అలజడులు జరిగినప్పుడు సైతం లోయలో ప్రశాంతత నెలకొని ఉండేదని, విదేశీ శక్తుల ప్రమేయంతోనే తాజా అల్లర్లు సంభవించినట్లు భావిస్తున్నానని డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్ అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఆందోళనలు చెలరేగకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

>
మరిన్ని వార్తలు