ఢిల్లీ ప్రపంచ పుస్తక మేళా ప్రారంభం

10 Jan, 2016 01:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత, చైనాల్లో ప్రచురణ రంగం అభివృద్ధి చెందుతోందని, ఇరు దేశాల సాంస్కృతిక సంబంధాలు మరింతగా మెరుగుపడతాయని కేంద్ర  మంత్రి స్మృతి ఇరానీ ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారమిక్కడి ప్రగతిమైదాన్‌లో 43వ న్యూఢి ల్లీ ప్రపంచ పుస్తక మేళా(వరల్డ్ బుక్ ఫెయిర్)ను ఆమె ప్రారంభించారు. భారత సాంస్కతిక వైభవం ప్రధానాంశంగా నిర్వహిస్తోన్న ఈ మేళాలో యువరచయితలకు ప్రోత్సహించడానికి నవలేఖన్ కార్యక్రమాన్ని తొలిసారి నిర్వహిస్తున్నారు. కాగా, రచయితలకు సంపూర్ణ భావప్రకటన స్వేచ్ఛ ఉండాలని బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ అన్నారు. ‘మనం నోరు విప్పకపోతే సమాజం ముందుకు వెళ్లదు’ అని ఢిల్లీ సాహిత్యోత్సవంలో అన్నారు.

మరిన్ని వార్తలు