కేంద్ర బడ్జెట్‌.. కాంగ్రెస్‌పై కుళ్లు జోక్స్‌

2 Feb, 2019 10:28 IST|Sakshi

న్యూఢిల్లీ : తాత్కాలిక ఆర్థిక శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ నేపథ్యలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌పై సోషల్‌ మీడియాలో కుళ్లు జోకులు పేలుతున్నాయి. మీమ్స్‌, సెటైరిక్‌ కామెంట్స్‌ తెగహల్‌చల్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా బడ్జెట్‌లో మధ్యతరగతి కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వడం.. వేతన జీవులకు భారీ ఊరట లభించడంపై నెటిజన్లు ఫన్నీ మీమ్స్‌ సృష్టిస్తున్నారు. తమ  వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యానికి పని చెప్పి మరి ట్రోల్‌ చేస్తున్నారు. గోయల్‌ ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదని సెటైర్స్‌ వేస్తున్నారు.

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ల ఫొటోలతో సరదాగా ఉన్న ఈ ట్వీట్ల్‌ నవ్వును తెప్పిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో వేతన జీవులకు రూ.5లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం, 15వేల లోపు జీతం ఉన్న అసంఘటిత కార్మికులకు పెన్షన్‌ స్కీం ప్రవేశపెట్టడం, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడంపై అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. ప్రతిపక్షాలు మాత్రం ఇది బీజేపీ ఎన్నికల జిమ్మిక్కేనని పెదవి విరుస్తున్నాయి.

మరిన్ని వార్తలు