వారసత్వంగా సంక్రమించే మానసిక వ్యాధులు

1 Dec, 2017 17:39 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: శారీరక అనారోగ్యాలు, వ్యాధులూ జన్యుకారకమని నిర్ధారణ అయినా చివరికి మానసిక అస్వస్థతలు సైతం ఒక తరం నుంచి మరొక తరానికి సంక్రమిస్తాయని తాజా అథ్యయనం వెల్లడించింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఫిన్‌లాండ్‌ నుంచి ఖాళీ చేసిన అప్పటి పిల్లల సంతానం ముఖ్యంగా కుమార్తెలు వారి తల్లులు అనుభవించిన మానసిక అలజడులు, వ్యాధులను ఎదుర్కొంటున్నట్టు ఈ అథ్యయనం పేర్కొంది. అప్పటి భయానక వాతావరణం ప్రస్తుతం లేకున్నా వారు మానసిక వ్యాధుల బారిన పడటానికి జన్యుపరమైన అంశాలే కారణమని తేలింది.

తరాల తరబడి మానసిక అస్వస్థతల రిస్క్‌ ఎందుకు పొంచిఉంటుందనే దానిపై స్వీడన్‌కు చెందిన ఉపసల యూనివర్సిటీ, ఫిన్‌లాండ్‌లోని హెల్సింకి వర్సిటీ పరిశోధకులు నిగ్గుతేల్చే పనిలో పడ్డారు.స్ర్తీలు గర్భవతులుగా ఉన్న సమయంలో విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటే వారి సంతానంపై అవి ప్రతికూల ప్రబావం చూపుతాయని అమెరికాకు చెందిన ప్రొఫెసర్‌ స్టీఫెన్‌ గిల్మన్‌ చెప్పారు.

యుద్ధ సమయంలో కుటుంబ సభ్యుల నుంచి విడిపోయిన తల్లుల సంతానం ముఖ్యంగా కుమార్తెల ఆరోగ్యంపై దీర్ఘకాలం ప్రభావం చూపుతుందని తమ అథ్యయనంలో వెల్లడైందని జామా సైకియాట్రీ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అథ్యయనం పేర్కొంది.

మరిన్ని వార్తలు