నా నోబెల్ బ‌హుమ‌తి తిరిగి ఇప్పించండి

8 Jun, 2020 16:36 IST|Sakshi

కోల్‌క‌తా : నోబెల్ బ‌హుమ‌తి కావాలి అంటూ ఓ మ‌హిళ హౌరా బ్రిడ్జి  ఎక్కి హ‌ల్‌చ‌ల్ చేసింది. ప్ర‌ముఖ ఆర్థిక‌వేత్త అమ‌ర్థ్య‌సేన్ నా నోబెల్ బ‌హుమ‌తిని దొంగిలించాడ‌ని ఆరోప‌ణ‌లు చేసింది. ఈ విష‌యంపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా ఫ‌లితం లేకుండా పోయిందంటూ వాపోయింది. నోబెల్ ప్రైజ్ తిరిగి ఇచ్చేవ‌ర‌కు క‌ద‌ల‌న‌ని భీష్మించుకొని కూర్చుంది. దీంతో ఆమెను కింద‌కి దించ‌డానికి పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది చాలా అవ‌స్థ‌లు ప‌డ్డారు. మ‌తిస్థిమితం లేని మ‌ధ్య వ‌య‌స్కురాలిగా పోలీసులు గుర్తించారు. ఆమె పేరు డొల్లి ఘోష్ అని అశోక్‌న‌గ‌ర్‌లో నివాసం ఉంటున్న‌ట్లు గుర్తించారు. ఆదివారం 6 గంట‌ల ప్రాంతంలో ఆమె హౌరా బ్రిడ్జిపై ఎక్కింద‌ని పోలీసులకు స‌మాచారం అంద‌డంతో వెంట‌నే అక్క‌డికి చేరుకున్న పోలీసులు ఆమెను కిందకి దింపేందుకు చాలా ప్ర‌య‌త్నాలు చేశారు. చివ‌రికి నోబెల్ ప్రైజ్ వెతికి తెచ్చిస్తామ‌ని మాట ఇవ్వ‌డంతో స‌ద‌రు మ‌హిళ కిందకు దిగేందుకు ఇప్పుకోవ‌డంతో విష‌యం స‌ద్దుమ‌ణిగింది. (కరోనా: అవసరం లేకపోయినా చికిత్స.. )


 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు