#మీటూ: చివరికి ఆపరేషన్‌ థియేటర్‌లో కూడా

12 Oct, 2018 12:38 IST|Sakshi

బాధితుల ఆక్రోశంతో పెల్లుబుకిన మీటూ ఉద్యమంపై విమర్శలు గుప్పిస్తున్న వారికి చెంప పెట్టులాంటి సంఘటన ఇది.  వైద్యుడు దేవుడితో సమానమని నమ్ముతాం. అలాంటిది నిస్సహాయ స్థితిలో ఉన్నమహిళను ఒక లైంగిక వస్తువుగా పరిగణించిన తీరు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. నాగరిక సమాజంలో ఇలాంటి అనాగరికమైన, ఘోరమైన ఘటనలను అసలు  ఊహించలేం. కానీ బాధితురాలి ఆత్మక్షోభ సాక్షిగా, ఆసుపత్రి థియేటర్‌ సాక్షిగా చెప్పిన సంగతులు గుండెల్ని మండిస్తాయి. దీంతో మహిళలకు ఇక ఎక్కడ రక్షణ? వెలుగు చూడని ఇలాంటి దారుణాలు ఇంకెన్ని ఉన్నాయో? అనే  ప్రశ్నలు ఉదయింకచమానవు
 
మీటూ ఉద్యమానికి ప్రధాన సారధిగా నిలిచిన గాయని చిన్మయి శ్రీపాదకు ట్వీటర్‌ ద్వారా బాధితురాలి గోడు సారాంశం ఇది.. ఆపరేషన్‌ అనంతరం థియేటర్లోని   బెడ్‌పై ఎనస్తీషియా  ప్రభావంతో అపస్మారకంగా పడి వున్న ఆమెపై  థియేటర్‌లోని జూనియర్‌ డాక్టర్లు అమానుషంగా ప్రవర్తించారు. చుట్టూ చేరి వెకిలిగా నవ్వుకుంటుండగా .. ఆమెకు కొద్దిగా మెలకువ వచ్చింది...అయితే బలహీనత కారణంగా ఏమీ చేయలేకపోయినా.. ఆ భయంకరమైన  అనుభవం తనను వెన్నాడుతోందని ఆమె ట్వీట్‌ చేశారు.

అయితే  హెల్యూషనేషన్‌( భ్రాంతి) అంటూ ఈ ఆరోపణలను  కొట్టిపారేసిన డాక్టర్‌ను స్పందించాల్సిందిగా  (ఇది భ్రాంతి ఏమాత్రం కాదు.. 2012 డిసెంబర్‌లో తనకెదురైన ఈ చేదు అనుభవంతోపాటు అసిస్టెంట్‌ డాక్టర్‌ ముఖం ఇప్పటికీ గుర్తు ఉందన్న బాధితురాలి ట్వీట్‌ ఆధారంగా)  చిన్నయి  ట్విటర్‌లో కోరారు.

మరిన్ని వార్తలు