-

ఐఏఎఫ్‌ అధికారులకు కోర్ట్‌ మార్షల్‌

15 Oct, 2019 08:50 IST|Sakshi

న్యూఢిల్లీ: సొంత క్షిపణి దాడి కారణంగా భారత వైమానిక దళ చాపర్‌ కూలిపోయిన ఘటనలో ఇద్దరు ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు కోర్టు మార్షల్‌ ఎదుర్కోనున్నారు. పీఓకేలోని బాలకోట్‌ ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపిన తరువాత, ఫిబ్రవరి 27న పొరపాటున  చేసిన క్షిపణి దాడిలో ఐఏఎఫ్‌ ఎంఐ 17 చాపర్‌ ఒకటి కశ్మీర్లోని బుద్గాంలో కూలిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో ఆరుగురు సిబ్బంది, ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయారు.

దీనిపై అంతర్గత విచారణ జరిపి, ఐఏఎఫ్‌ అధికారుల మధ్య సమాచార లోపం కారణంగానే ఈ దుర్ఘటన జరిగినట్లు తేల్చారు. ఈ ఘటనకు సంబంధించి ఒక గ్రూప్‌ కెప్టెన్, మరో వింగ్‌ కమాండర్‌ కోర్టు మార్షల్‌ను ఎదుర్కొంటారని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఇద్దరు ఎయిర్‌ కమాండర్లు, ఇద్దరు ఫ్లైట్‌ లెఫ్ట్‌నెంట్లపైనా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని వెల్లడించాయి.  

మరిన్ని వార్తలు