షెల్టర్‌ హోంలోనే తుదిశ్వాస

28 May, 2020 20:07 IST|Sakshi

వలస కూలీల ఇక్కట్లు

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని యమునా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో వలస కూలీల కోసం ఏర్పాటు చేసిన షెల్టర్‌ హోంలో ఓ వలస కార్మికుడు గురువారం మరణించారు. వివేక్‌ విహార్‌ ప్రాంతంలో ఉన్న ఈ షెల్టర్‌ హోంలో గత కొద్దిరోజులుగా మృతుడు ఉంటున్నట్టు సమాచారం. కాగా షెల్టర్‌ హోంలో మరణించిన వ్యక్తి మృతికి కారణాలు తెలియరాలేదు. కరోనా కట్టడికి విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో వలస కూలీలు, నిరాశ్రయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

పనులు లేక వేలాది మంది వలస కూలీలు రోడ్లపై నడుచుకుంటూ శ్రామిక్‌ రైళ్ల ద్వారా స్వగ్రామాల బాట పడుతున్నారు. ఇళ్లకు వెళ్లేలోపే మంచినీరు, ఆహారం లభించక పలువురు ప్రాణాలు విడిచిన ఘటనలు చోటుచేసుకున్నాయి. మరోవైపు వలస కూలీలకు ఊరటగా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రైళ్లు, బస్సుల్లో ప్రయాణించే వలస కూలీల చార్జీలను ప్రభుత్వమే భరించాలని, వారికి ఉచితంగా భోజనం, మంచినీరు సమకూర్చాలని సర్వోన్నత న్యాయస్ధానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

చదవండి : కార్మికుల రైలు బండికి ‘టైం టేబుల్‌’ లేదట!

మరిన్ని వార్తలు