వలస కూలీల ఆకలి దారిద్య్రం కళ్లకు కట్టింది

24 May, 2020 10:52 IST|Sakshi

ఢిల్లీ : కరోనా వైరస్‌ నేపథ్యంలో వలస కూలీలు ఆకలి దారిద్య్రం ఎంత ధీనావస్థలో ఉందనేది ఈ ఫోటో తెలియజేస్తుంది. సొంతూళ్లకు వెళ్లేందుకని కేంద్రం ఏర్పాటు చేసిన శ్రామిక్‌ రైలును ఎక్కేందుకు వచ్చిన వలస కూలీలు ఆహారం కోసం ఒకరినొకరు తోసుకుంటూ మరీ లూటీకి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం సాయంత్రం ఓల్డ్‌ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. శ్రామిక్‌ రైలు ఎక్కేందుకు ఓల్డ్‌ ఢిల్లీ రైల్వే స్టేషన్‌కు వచ్చిన కొంతమంది వలస కూలీలు రైలు ఎక్కడానికి సిద్దమయ్యారు. ఈ తరుణంలో అ‍క్కడికి ఒక వ్యక్తి ఒక తోపుడుబండిలో చిప్స్‌, బిస్కెట్స్‌, వాటర్‌ బాటిల్స్‌ తీసుకొని వచ్చాడు.
(భారత్‌లో లక్షా ముప్పైవేలు దాటిన కరోనా కేసులు)

కొంతమంది వ్యక్తులు అతన్ని ఆపి కొనడానికి యత్నం చేస్తుండగా.. నిమిషాల వ్యవధిలోనే జనం సమూహం పెరిగిపోయి ఆహారం కోసం ఎగబడ్డారు. ఎవరికి తోచినట్లుగా వారు ఆహారాన్ని ఎత్తుకెళ్లిపోయారు. ఇక చివరగా అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆహారం నాదంటే నాదని వాదులాడుకోవడం ఆకలి దారిద్య్రం  కళ్లకు కట్టినట్లు చూపింది. అయితే ఇదంతా రైల్వే స్టేషన్‌లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఆ సమయంలో అక్కడ ఒక్క రైల్వే పోలీసు అధికారి లేకపోవడం గమనార్హం. అయితే శ్రామిక్‌ రైళ్లకోసం మాత్రమే ఓల్డ్‌ ఢిల్లీ రైల్వే స్టేషన్‌ను వాడుతున్నట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. దేశం మొత్తం లాక్‌డౌన్‌ విధించడంతో వలస కూలీలు పనుల్లేక పస్తులతో కాలం గడుపుతున్నారు. సొంతూళ్లకు కాలినడకనే బయలుదేరిన వలసకూలీలు తినడానికి సరైన తిండి లేక వారి బతుకులు చిద్రంగా తయారవుతున్నాయి. (వ్యక్తి చెవిలో నుంచి బుల్లెట్‌.. ఆపై భార్య మెడలోకి)

మరిన్ని వార్తలు