సీఆర్‌పీఎఫ్‌ ఇక మరింత బలోపేతం

26 Mar, 2019 03:44 IST|Sakshi

న్యూఢిల్లీ: కశ్మీర్‌ లోయలో జవాన్ల భద్రతా చర్యల్లో భాగంగా కీలక ముందడుగు పడింది. వారి భద్రత కోసం మందుపాతర రక్షిత వాహనాలను (ఎమ్‌పీవీ), 30 సీటర్‌ బస్సులను సమకూర్చనున్నట్లు భద్రతా దళాధికారి ఒకరు తెలిపారు. అలాగే కశ్మీర్‌ లోయలో ఉగ్రవాద నిర్మూలన, శాంతి భద్రతల విధులను నిర్వహిస్తున్న 65 బెటాలియన్లలో బాంబులను గుర్తించే, నిర్వీర్యం చేసే స్క్వాడ్‌ బృందాలను పెంచాలని కూడా పారామిలిటరీ నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై పేలుడు పరికరం ఉపయోగించి చేసిన బాంబు దాడిలో 40 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో సీఆర్‌పీఎఫ్‌లో ఈ మేరకు చర్యలు చేపట్టారు. ‘కశ్మీర్‌లో మాకున్న ప్రతికూలతల నివారణకు చర్యలు చేపడుతున్నాం. బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సులు, ఎక్కువ మొత్తంలో ఎమ్‌పీవీలను సేకరిస్తున్నాం. పెద్ద బస్సులకు భద్రత కష్టంగా ఉంటుంది. అందుకే 30 మంది మాత్రమే కూర్చోడానికి వీలుండే బస్సులను సమకూరుస్తున్నాం’అని సీఆర్‌పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌.ఆర్‌.భట్నాగర్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు