త్వరలో అమల్లోకి ‘కనీస వేతనం’!

6 Jun, 2017 01:14 IST|Sakshi
త్వరలో అమల్లోకి ‘కనీస వేతనం’!

న్యూఢిల్లీ: దేశంలో ఉన్న అన్ని రకాల పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు సార్వత్రిక కనీస వేతనం అందే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. శ్రామికులకు లాభసాటిగా ఉండేలా వేతనాలపై ప్రభుత్వం ఇప్పటికే ఓ ముసాయిదాను రూపొందించిందని ఓ అధికారి పేర్కొన్నారు. కార్మికుల సమస్యలపై ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ నేతృత్వంలో ఏర్పాటైన మంత్రుల కమిటీ ముసాయిదాను ఇప్పటికే ఆమోదించి మార్పులు, చేర్పుల కోసం న్యాయ మంత్రిత్వ శాఖకు పంపిందని ఆయన చెప్పారు.

ఈ నెలలోనే ముసాయిదాను మంత్రివర్గం ముందుకు తీసుకొస్తారనీ, ఆమోదం పొందిన అనంతరం త్వరలో ప్రారంభంకానున్న వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెడతారని అధికారి వివరించారు. ప్రస్తుతం కనీస వేతన నిబంధనలు రూ.18 వేల లోపు జీతం అందుకునే ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తున్నాయి. జీతంతో సంబంధం లేకుండా కార్మికులందరికీ కనీస వేతన నిబంధనలు వర్తించేలా ముసాయిదాలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు