ప్రత్యేక హోదా రాష్ట్రాలకు టాక్స్‌ రీఫండ్‌..

6 Mar, 2018 20:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా ఉన్న  రాష్ట్రాలలో పరిశ్రమలు చెల్లించే టాక్స్‌ను తిరిగి ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌ శుక్లా తెలిపారు. ఈ విషయాన్ని ఆయన రాజ్యసభలో మంగళవారం వెల్లడించారు. వైఎస్‌ఆర్‌ నేత విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 

2017 అక్టోబర్‌ 5న జారీ చేసిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ పాలసీ అండ్‌ ప్రమోషన్‌(డీఐపీపీ) చేసిన ప్రకటన అనుగుణంగా ఈ వెసులుబాటు కల్పిస్తునట్లు మంత్రి తెలిపారు. గతంలో సెంట్రల్‌ ఎక్సైజ్‌ సుంకం మినహాయింపుకు అర్హత పొందిన పరిశ్రమలకు ఇది వర్తిస్తుందన్నారు. ఆయా పరిశ్రమలు చెల్లించిన సెంట్రల్‌ టాక్స్‌, ఇంటిగ్రేటెడ్‌ టాక్స్‌ కింద చెల్లించే మొత్తాలతో కొంత శాతాన్ని బడ్జేట్‌ మద్దతు ద్వారా వాపసు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. జీఎస్టీ అమలు నుంచి స్పెషల్‌ కేటగిరీ రాష్ట్రాలకు ఎలాంటి పన్ను ప్రోత్సహకాన్ని ప్రకటించలేదని మంత్రి స్పష్టం చేశారు. 

హోమియోపతి బూటకం కాదు..
హోమియోపతి బూటకం కాదని సహాయ మంత్రి యసో నాయక్‌ రాజ్యసభలో మంగళం తెలిపారు. ఈ వైద్య విధానంతో పద్ధతి ప్రకారం నిర్వహించిన అనేక సమగ్ర అధ్యయనాల సమీక్షల ద్వారా  నిశ్చయమైన, నిర్ధిష్టమైన ఫలితాలు ఉంటాయన్నారు. 

రాజ్యసభలో వైఎస్‌ఆర్ నేత విజయసాయి రెడ్డి అగిడిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ.. అనేక రోగాలకు సంబంధించి హోమియోపతిలో లభించే వైద్య చికిత్సా విధానాలపై నాలుగు సిస్టమాటిక్‌/మెటా- అనాలిస్‌లు అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందిన మెడికల్‌ జర్నల్స్‌లో ప్రచురితం అయినట్లు చెప్పారు. వీటిలో మూడు అధ్యయనాలపై వందలాది క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించిన తర్వాత హోమియోపతి క్లినికల్‌గా సమర్ధవంతమైన ఫలితాలు ఇచ్చినట్లు నిరూపితమైందన్నారు. 

హోమియోపతి చికిత్స సురక్షితమైనది, సమర్ధవంతమైనదని మంత్రి పేర్కొన్నారు. దేశంలో హోమియోపతిపై  అనేక హై క్వాలిటీ సర్వేలు నిర్వహించారు. దీంట్లో ఈ చికిత్సా విధానానికి ప్రజలలో అత్యధిక ఆమోదం ఉన్నట్లు వెల్లడైనందునే ప్రభుత్వం హోమియోపతిని పోత్సహిస్తున్నట్లు మంత్రి  నాయక్‌ చెప్పారు. గత ఐదు సంవత్సరాలలో 50 శాతం రోగులు హోమియో చికిత్స ద్వారా స్వస్థత పొందినట్లు మంత్రి తెలిపారు.

మరిన్ని వార్తలు