‘భారత్‌ మాతాకీ జై’ సహజంగా అనాల్సిందే

14 Aug, 2018 12:40 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లక్నో : భారత్‌ మాతాకీ జై అనే నినాదం సహజ సిద్దంగా రావాల్సిందేనని, అది దేశంపై ఉన్న ప్రేమ, భక్తిలకు నిదర్శనమని ఉత్తరప్రదేశ్‌ మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి చౌదరి లక్ష్మీనారయణ తెలిపారు. ముఖ్యంగా భారత జెండా ఆవిష్కరణ, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రతి పౌరుడు నోట సహజంగా రావాల్సిందేనన్నారు. 

‍ప్రభుత్వ వక్ఫ్‌ భూముల్లో నడుస్తున్న 1500 మదర్సాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయమనడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రతీ ఏడాది మదర్సాల్లో జెండా పండుగ జరుగుతోందని, జాతీయ గీతం ఆలిపిస్తున్నారని, భారత్‌ మాతాకీ జై అని నినదిస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో ఎక్కడా ఆదేశాలు జారీచేయాల్సిన అవసరం లేదన్నారు. జెండా పండుగ నిర్వహించి అమరుల త్యాగాలను గుర్తుచేసుకుంటామన్నారు. ఇక కొంత మంది జాతీయ గీతం ఆలిపించాలా? లేదా అని సందిగ్ధంలో ఉన్నారన్నారు. సీనియర్‌ హైకోర్టు లాయర్‌, ఆల్‌ఇండియా ముస్లిం బోర్డు సెక్రటరీ జాఫర్యాబ్‌ జిలాని అందరూ జాతీయ గీతాన్ని గౌరవిస్తూ పాడాలన్నారు.

రాష్ట్రంలోని మదర్సాల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించేలా.. ‘భారత్ మాతాకి జై’ అని నినదించేలా ఆదేశాలు జారీ చేయాలని షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ వసీం రజ్వీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు