రిటైర్‌ అయిన వెంటనే వారికి పదవి సరికాదు

10 Apr, 2017 01:53 IST|Sakshi
రిటైర్‌ అయిన వెంటనే వారికి పదవి సరికాదు

జడ్జిలు, బ్యూరోక్రాట్లకు గవర్నర్‌ పదవిపై మంత్రి యనమల

సాక్షి, న్యూఢిల్లీ: పదవీ విరమణ చేసిన వెంటనే న్యాయమూర్తులకు, బ్యూరోక్రాట్లకు గవర్నర్‌ పదవులు కట్టబెట్టడం సరికాదని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన ఆదివారం జరిగిన అంతర్రాష్ట్ర మండలి స్థాయీ సంఘం సమావేశంలో సీఎం చంద్రబాబు తరఫున యనమల పాల్గొన్నారు.

గవర్నర్ల ఎంపికకు అర్హత విధానం ఖరారు చేసే అంశాన్ని ప్రస్తావిస్తూ.. పదవీ విరమణ చేసిన కొంత కాలం తర్వాతే జడ్జిలు, బ్యూరోక్రాట్లను గవర్నర్‌ పదవికి ఎంపికకు పరిగణించాలని సూచించారు. ఏదైనా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్లు చేసే సిఫార్సులను ఆమోదించొద్దని మంత్రి యనమల కేంద్రాన్ని కోరారు. ఏదైనా బిల్లును ఆమోదించడానికి లేదా రాష్ట్రపతికి పంపడానికి గవర్నర్‌కు నెల రోజుల గడువు ఇవ్వాలన్నారు.

>
మరిన్ని వార్తలు