చైనావి అతిశయోక్తి, ఆమోదయోగ్యం కాని వాదనలు

18 Jun, 2020 11:11 IST|Sakshi

న్యూఢిల్లీ : లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ తమ భూభాగంలోనిదంటూ చైనా చేస్తున్న వాదనలను విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ తీవ్రంగా తప్పుబట్టారు. చైనా అతిశయోక్తి, ఆమోదయోగ్యం కాని వాదనలు చేస్తోందని, అటువంటి వాదనలు ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించటానికి పూర్తివిరుద్దమని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ బుధవారం ఉదయం ఇరు దేశాల విదేశాంగ మంత్రులు జై శంకర్‌, వాంగ్‌‌ యీలు తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న పరిస్థితిపై ఫోన్‌ ద్వారా చర్చించారు. గాల్వాయ్‌ లోయ వివాదం ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జై శంకర్‌, వాంగ్‌‌ యీని హెచ్చరించారు. ( భారత్‌ను దెబ్బతీసేందుకు చైనా జిత్తులు )

చైనా సైనికుల దుందుడుకు చర్య కారణంగా 20మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. జూన్‌ 6న రెండు దేశాల కమాండింగ్‌ అధికారుల స్థాయి చర్చల్లో కుదిరిన ఒప్పందాన్ని ఇరుదేశాలు నిజాయితీగా, నిక్కచ్చిగా అమలు చేయాలని చైనాకు తేల్చిచెప్పారు. అనంతరం సరైన పద్దతిలో వివాదాన్ని పరిష్కరించటానికి ఇరు దేశాల విదేశాంగ మంత్రులు పరస్పరం ఆమోదం తెలుపుకున్నార’’ని పేర్కొన్నారు. ( సరిహద్దు ఘర్షణలో సరికొత్త సవాళ్లు)

మరిన్ని వార్తలు