ఖాకీ కాఠిన్యం..

30 Aug, 2016 21:41 IST|Sakshi
ఖాకీ కాఠిన్యం..

గ్వాలియర్ః రైల్వే స్టేషన్ లో పిక్ పాకెటింగ్ కు పాల్పడ్డాడన్న అనుమానంతో ఓ బాలుడిపై రైల్వే కానిస్టేబుల్ ప్రతాపం చూపించాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ లో జరిగిన ఘటన అందర్నీ విస్మయ పరచింది. ఎప్పుడూ జనంతో రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లో బాలుడి మెడకు టవల్ ను కట్టి, దారుణంగా కొడుతూ ఈడ్చుకెళ్ళడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఆగస్టు 27న ప్లాట్ ఫాం నెంబర్ 1 లో జరిగిన ఘటనపై రికార్డయిన వీడియో వైరల్ గా మారింది.

గ్వాలియర్ రైల్వే స్టేషన్ లో బాలుడ్ని తీవ్రంగా హించించిన ప్రభుత్వ రైల్వే పోలీస్ (జీఆర్పీ) ను వీడియో ఆధారంగా హెడ్ కానిస్టేబుల్ హరి నారాయణ్ సింగ్ (50) గా గుర్తించారు. అయితే బాలుడ్ని విచక్షణా రహితంగా కొడుతూ, ప్లాట్ ఫాం పై ఈడ్చుకెళ్ళిన కానిస్టేబుల్.. అతడ్ని పోలీస్ స్టేషన్ కు అప్పగించకపోవడంపైనా పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అయితే ఓ ప్రయాణీకుడు తన జేబు కొట్టేశారని ఇచ్చిన కంప్లైంట్ తో... బాలుడ్ని చిల్లర దొంగగా అనుమానించిన జీఆర్పీ సింగ్.. అతడ్ని పట్టుకొని కొట్టడంతోపాటు ఈడ్చుకుంటూ వెళ్ళడంతో సదరు బాలుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వీడియోను వీక్షించిన రైల్వే పోలీసు అన్నతాధికారులు హెడ్ కానిస్టేబుల్ సింగ్ ను సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు