రేపిస్ట్ను కొట్టి చంపిన గ్రామస్తులు

22 Jun, 2017 08:50 IST|Sakshi
రేపిస్ట్ను కొట్టి చంపిన గ్రామస్తులు

అలీఘఢ్(యూపీ) :
ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితున్ని గ్రామస్తులు కొట్టి చంపారు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్లోని అలీఘఢ్లో చోటుచేసుకుంది. చిన్నారిని రక్షించడంలో స్థానిక పోలీసులు నిర్లక్ష్యం వహించడంతో.. గ్రామస్తులే నిందితున్ని పట్టుకొని చితకొట్టారు. తీవ్రగాయాలైన అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.  

వివరాలు... అలీఘఢ్లోని బన్నా దేవి ప్రాంతానికి చెందిన ఆరేళ్ల చిన్నారిని బిహార్లోని బదౌన్కు చెందిన అర్వింద్ అకా కిడ్నాప్ చేశాడు. బాలిక ఇంటి సమీపంలోనే అర్వింద్ పని చేసేవాడు. మంగళవారం సాయంత్రం నుంచి బాలిక కనిపించకుండా పోయింది. దీంతో బాలిక తల్లిదండ్రులు తెలిసిన వారిని విచారించగా, అర్వింద్ బాలికను తీసుకువెళ్తుండగా తాము చూశామని తెలిపారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా వారు సమయానికి స్పందించలేదు.   

దీంతో గ్రామస్తులే జట్లుగా ఏర్పడి గాలించి అర్వింద్ను పట్టుకున్నారు. చిన్నారిని బికామ్పుర్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం చేసినట్టు గ్రామస్తులకు అర్వింద్ తెలిపాడు. తన పేరు ఎక్కడ బయటపెడుతుందో అని బయపడి చిన్నారి గొంతునులిమి హత్య చేసినట్టు గ్రామస్తులకు చెప్పాడు. అనంతరం అర్వింద్ చెప్పిన స్థలంలో చిన్నారి మృతదేహాన్ని కనుగొన్నారు. అక్కడ చిన్నారి మృతదేహాన్ని చూసిన గ్రామస్తుల కోపం కట్టలు తెంచుకోవడంతో.. అర్వింద్పై మూకమ్మడిగా దాడి చేశారు. అదే సమయానికి పోలీసులు వచ్చి తీవ్రగాయాలైన నిందితుడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్వింద్ మృతిచెందాడు. పోలీసులు విచారణ ప్రారంభించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా