మోడీ ‘మైనారిటీ’ మంత్రం

11 Jul, 2014 02:14 IST|Sakshi
మోడీ ‘మైనారిటీ’ మంత్రం

న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మదర్సాల ఆధునీకరణకు రూ.100 కోట్లు కేటారుుంచింది. సంప్రదాయ కళల్లో మైనారిటీల నైపుణ్యాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి గాను మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు రూ.3,734.01 కోట్ల బడ్జెట్ కేటారుుంచింది. ఇది గత ఏడాది బడ్జెట్‌తో పోల్చుకుంటే 5.75% అధికం. కాంగ్రెస్ నేతృత్వంలోని గత యూపీఏ ప్రభుత్వం రూ.3,530.98 కోట్లు కేటారుుంచింది. కాగా మదర్సాల ఆధునీకరణ కోసం పాఠశాల విద్యా శాఖకు అదనంగా రూ.100 కోట్లు కేటారుుస్తున్నట్టు ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. 

బాలికా శిశు రక్షణకు కొత్త పథకం

దేశంలో బాలికలు, ఆడ శిశువులపై నిర్లక్ష్యం, వివక్షను రూపుమాపడానికి రూ.100 కోట్లతో కేంద్రం ‘బేటీ బచావో, బేటీ పఢావో యోజన’ను ప్రకటించింది. పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా దేశం దూసుకుపోతున్నా.. ఆడ శిశువులు, మహిళలపై వివక్ష కొనసాగుతుండడం సిగ్గుపడాల్సిన అంశమని జైట్లీ వ్యాఖ్యానించారు. ఈసారి బడ్జెట్‌లో స్త్రీ,శిశు సంక్షేమ, అభివృద్ధి శాఖకు రూ. 21,100 కోట్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఆడపిల్లల చదువు, పెళ్లి కోసం ఒక ప్రత్యేక చిన్నమొత్తాల పొదుపు పథకాన్ని ప్రవేశపెడతామని వెల్లడించారు. ‘బేటీ బచావో...’ పథకంలో భాగంగా ఆడ శిశువులు, బాలికలపై వివక్షను రూపుమాపడం, వారి రక్షణపై దేశవ్యాప్తంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామని మంత్రి చెప్పారు. ఇక పెద్ద నగరాల్లో మహిళలకు మరింత భద్రత నిమిత్తం రూ. 150 కోట్లు, ప్రజా రవాణా వ్యవస్థలో మహిళల భద్రత కోసం రూ.50 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దీంతోపాటు ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అత్యాచార  బాధితుల కోసం ‘సంక్షోభ నివారణ కేంద్రాల’ను ఏర్పాటు చేయాలని, ఇందుకు ‘నిర్భయ నిధి’ నుంచి కేటాయింపులు జరపాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. గిరిజన సంక్షేమం కింద ఎస్‌టీ పిల్లల విద్యా పథకానికి రూ.1,058 కోట్లు, వన బంధు కల్యాణ్ యోజనకు గాను రూ.100 కోట్లు గిరిజన వ్యవహారాల శాఖకు కేటారుుంచారు. ఇలా ఉండగా ఎస్పీ ప్రణాళిక కింద రూ.50,548 కోట్లు, టీఎస్పీ కింద రూ.32,387 కోట్లు ప్రతిపాదించారు.

‘అన్‌క్లెయిమ్డ్’ సొమ్ము వృద్ధులకు...

సేవింగ్స్ స్కీముల్లో ‘అన్‌క్లెయిమ్డ్’ పేరిట మూలుగుతున్న భారీ మొత్తంలోని సొమ్మును ప్రత్యేకంగా వృద్ధుల(సీనియర్ సిటిజన్స్) సంక్షేమం కోసం వినియోగించనున్నట్టు జైట్లీ తెలిపారు. వివిధ పథకాల కింద పొదుపు చేసుకున్న వృద్ధులు మరణించిన సందర్భాల్లో.. చెల్లింపులకు సంబంధించి తగిన మార్గదర్శకాలకోసం వేచిచూస్తూ ఆ మొత్తా లు ‘అన్‌క్లెయిమ్డ్’ కింద మిగిలిపోతున్నాయన్నారు. ఈ సొమ్మును వృద్ధుల రక్షణకు, వారి ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణకు ఎలా ఉపయోగించవచ్చో సూచించేందుకు కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
 
 

>
మరిన్ని వార్తలు