‘అయోధ్య’పై మధ్యవర్తిగా ఉంటా: రిజ్వీ

19 Nov, 2018 04:39 IST|Sakshi
ఘయోరుల్‌ హసన్‌ రిజ్వీ

న్యూఢిల్లీ: అయోధ్యలో బాబ్రీమసీదు–రామమందిరం వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకునేందుకు వీలుగా ఇరుపక్షాలతో చర్చలు జరుపుతానని మైనారిటీల జాతీయ కమిషన్‌(ఎన్‌సీఎం) చైర్మన్‌ ఘయోరుల్‌ హసన్‌ రిజ్వీ తెలిపారు. రామమందిరం హిందువుల విశ్వాసానికి సంబంధించిన విషయం అయినందున ముస్లింలు పెద్దమనసు చేసుకోవాలని సూచించారు. అయోధ్యలో మందిర నిర్మాణానికి ముస్లింలు అంగీకరిస్తే, కాశి, మధుర సహా మిగతా ప్రాంతాల్లోని మసీదుల విషయంలో హిందూసంస్థలు వెనక్కి తగ్గేలా కృషి చేస్తానన్నారు.

మరిన్ని వార్తలు