ఓటు వేయండి.. కిరీటం గెలుస్తా

31 Oct, 2019 10:06 IST|Sakshi
నిషా తాలంపల్లి

మిస్‌ ఇండియా ఇంటర్నేషనల్స్‌ ఫైనలిస్ట్‌ నిషా తాలంపల్లి

పంజగుట్ట: కర్ణాటక, బీదర్‌ జిల్లాల్లోని మారుమూల గ్రామానికి చెందిన ఓ యువతి మిస్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ టైటిల్‌కు పోటీ పడుతోంది. యూట్యూబ్‌లో ఓటు వేసి తనను గెలిపిస్తే టైటిల్‌ తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది. ఆమే నిషా తాలంపల్లి. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తన వివరాలు వెల్లడించింది. బీదర్‌ జిల్లాలోని దుమున్‌సూర్‌ గ్రామానికి చెందిన నిషా తాలంపల్లి తల్లి బిందుమతి గృహిణి, తండ్రి శ్రీనివాస్‌ వ్యవసాయం చేస్తాడని, ప్రముఖ సినీనటి ప్రియాంకా చోప్రాను ఆదర్శంగా తీసుకుని మోడలింగ్‌లోకి వచ్చానని, తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మోడలింగ్, ఫ్యాషన్‌ రంగంలో పలు పోటీల్లో విజేతగా నిలిచినట్టు వివరించింది.

తాను నవంబర్‌ 18న ఇండోనేసియాలోని రాజధాని జకర్తాలో జరిగే మిస్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ ఫైనల్స్‌కి సిద్ధమవుతున్నానని, దేశవ్యాప్తంగా 9 వేల దరఖాస్తులు రాగా వాటి నుంచి 30 మందిని ఎంపిక చేశారని, తాను అందులో చోటు దక్కించుకున్నానని వివరించింది. ఈ పోటీలో గెలిచేందుకు తనకు తెలంగాణ రాష్ట్ర ప్రజల మద్దతు తప్పనిసరిగా పేర్కొంది. యూట్యూబ్, గూగుల్‌లో తన పేరు టైప్‌ చేసి లైక్‌ కొడితే పాయింట్లు వస్తాయని, ఒక్కో పాయింట్‌ తనను కిరీటం వైపు తీసుకెళుతుందని వివరించింది. ఈ సమావేశంలో నిషా తండ్రి శ్రీనివాస్‌ తాలంపల్లి, శ్రేయోభిలాసులు బాసు హిలాల్‌పూర్, రామకృష్ణారెడ్డి, ధర్మేందర్‌ పూజారి, అనిల్‌ పాటిల్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు