ఏఎన్‌- 32 విమాన శకలాలు లభ్యం

11 Jun, 2019 15:53 IST|Sakshi

ఈటానగర్‌ : భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్‌–32 రకం విమాన ఆచూకీని ఎంఐ–17 విమానాలు కనుగొన్నాయి. విమాన శ‌క‌లాల‌ను అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని లిపోకి 16 కిలోమీట‌ర్ల దూరంలో కనుగొన్నారు. అయితే విమానంలో ఉన్న సిబ్బంది ప‌రిస్థితి గురించి త్వ‌ర‌లో తెలియ‌జేయ‌నున్న‌ట్లు ఓ ట్వీట్‌లో ఐఏఎఫ్ తెలిపింది. జూన్‌ 3న 13 మందితో బయలుదేరిన ఏఎన్‌32 విమానం గాలిలోకి ఎగిరిన 33 నిమాషాల అనంతరం గల్లంతైన సంగతి తెలిసిందే. అస్సాంలోని జొర్హాత్‌ నుంచి మధ్యాహ్నం 12.27 గంటలకు బయలుదేరిన ఈ విమానం అరుణాచల్‌ప్రదేశ్‌లోని మెంచుకాకు (చైనా సరిహద్దుకు దగ్గర్లో) చేరాల్సి ఉండగా, మార్గమధ్యంలోనే కనిపించకుండా పోయింది.  విమానం గల్లంతైన మరుక్షణం నుంచే అధికారులు దాని ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. విమానం ఆచూకీ కనుగోవడానికి అత్యంత సామర్థ్యం కలిగిన హెలికాఫ్టర్లను కూడా వాయుసేన రంగంలోకి దించింది. అయితే కొండ ప్రాంతాలు కావడంతో  ప్రతికూల పరిస్థితుల వల్ల అన్వేషణ ఇబ్బందికరంగా మారింది. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు ఎంఐ–17 విమానాలు, అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్‌లు గల్లంతైన విమానం కోసం అటవీ ప్రాంతంల్లో జల్లెడపట్టాయి. గల్లంతైన ఏఎన్‌32 రకం విమానం ఆచూకీ తెలిపిన వారికి భారత వాయుసేన 5 లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించింది.

పదేళ్ల క్రితమూ ఇలాగే..
అది 2009 సంవత్సరం జూన్‌ నెల. భారత వాయుసేనకు చెందిన ఏఎన్‌–32 రకం రవాణా విమానం 13 మందిని ఎక్కించుకుని వెళ్తుండగా అరుణాచల్‌ ప్రదేశ్‌లో కూలిపోయింది. అందులోని మొత్తం 13 మంది మరణించారు. పశ్చిమ సియాంగ్‌ జిల్లాలోని రించీ హిల్‌పైన ఆ విమానం కూలిపోయింది. ఆ విమానం మెచుకా నుంచి అసోంలోని మోహన్‌బరి వైమానిక స్థావరానికి వెళ్తుండగా మెచుకాకు 30 కిలోమీటర్ల దూరంలో దుర్ఘటన జరిగింది. విచిత్రం ఏమిటంటే సరిగ్గా పదేళ్లకు జూన్‌ నెలలోనే 13 మందితో మెచుకా వెళ్తున్న ఏఎన్‌–32 రకం విమానం కూలిపోయింది. ఇందులో కూడా 13 మందే ఉండటం గమనార్హం. ఈ విమానం మెచుకాకు వెళుతుండగానే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘మరో కార్గిల్‌ వార్‌కు రెఢీ’

‘నా కల నిజమైంది.. మళ్లీ ఆశలు చిగురించాయి’

ఈనాటి ముఖ్యాంశాలు

జయప్రద వర్సెస్‌ డింపుల్!

టిక్‌ టాక్‌: మహిళా పోలీసుల స్టెప్పులు.. వైరల్‌

యువతికి రాంచీ కోర్టు వినూత్న శిక్ష

భారీ వర్ష సూచన.. రెడ్‌అలర్ట్‌ ప్రకటన

విమాన ప్రయాణీకులకు భారీ ఊరట

‘వాళ్లు పుస్తకం ఎలా కొంటారు’

అసెంబ్లీ ఎన్నికలు: కమలానికి కొత్త సారథి

ఫేక్‌న్యూస్‌ : 15వ దలైలామాగా ‘సత్యసాయి’ విద్యార్థి

‘మళ్లీ సోనియాకే పార్టీ పగ్గాలు’

కుప్పకూలిన భవనం : శిథిలాల కింద..

ఐఏఎఫ్‌లో చేరనున్న అమర జవాన్‌ భార్య

కేంద్ర మంత్రులపై మోదీ ఆగ్రహం

ప్రజలకు అది పెద్ద సమస్య.. దృష్టి పెట్టండి : మోదీ

14 మంది ఉగ్రవాదులకు రిమాండ్‌

నటిపై అసభ్యకర కామెంట్లు.. వ్యక్తి అరెస్ట్‌

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రోషన్‌ బేగ్‌ అరెస్ట్‌

డ్రైవింగ్‌ లైసెన్స్‌కు ‘ఆధార్‌’ ఆపేశాం

‘ఆయనేం దేవుడు కాదు; రూల్స్‌ చదువుకుంటే మంచిది’

ఐదేళ్ల చిన్నారిపై కీచకపర్వం

పెళ్లి వేడుకకూ పరిమితులు

‘హిమాచల్‌’ మృతులు14

గవర్నర్‌ కీలుబొమ్మా?

‘కోట్ల’ కర్నాటకం

ఇంజనీరింగ్‌లో ఆ కోర్సులకు సెలవు

రోడ్డు ప్రమాదంలో మరణిస్తే 5 లక్షలు

18న బలపరీక్ష

ఎన్‌ఐఏకి కోరలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

మూడు నెలల అనంతరం రిజెక్ట్‌ చేశారు..

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’

‘నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి క్యాటీ’