ఆ విమానంలో ఏఎల్‌టీ కూడా లేదు!

3 Aug, 2016 11:47 IST|Sakshi
ఆ విమానంలో ఏఎల్‌టీ కూడా లేదు!

ముందుకు సాగని ఏఎన్-32 గాలింపు

సాక్షి ప్రతినిధి, చెన్నై: భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 విమానం ఇటీవల గల్లంతవడం, అందులోని పలు లోపాలు బయటపడటం తెలిసిందే. అయితే విమానాన్ని గుర్తించడానికి ఉపయోగించే పరికరం(ఏఎల్‌టీ) కూడా లేదన్న విషయం మంగళవారం బయటపడింది. సముద్రంపై ప్రయాణించే, సైనిక విమానాలకు ఏఎల్‌టీని అమరుస్తారు. నీటి అడుగుభాగంలో విమానం ఉన్నట్లయితే ఈ పరికరం నుంచి సిగ్నల్స్ వెలువడి విమానాన్ని గుర్తించవచ్చు. వీటిని ప్రస్తుతానికి సీ130జే, సీ17 విమానాల్లోనే వినియోగిస్తున్నారు. కానీ వీటిని అన్ని రకాల విమానాలకు ఉపయోగించడానికి ఇప్పటికే పెద్ద సంఖ్యలో కేంద్ర రక్షణ శాఖ కొని ఉంచింది.

ఏఎన్ 32 రకం విమానాల్లో దేనికీ ఈ పరికరాన్ని అమర్చలేదని తెలుస్తోంది. ఈ పరికరమే ఉన్నట్లయితే ఈ పాటికి విమానాన్ని గుర్తించి ఉండే వారిమని గాలింపు చర్యల్లో పాల్గొంటున్న ఓ అధికారి తెలిపారు. గల్లంతయిన విమానం చెన్నై నుంచి పోర్టుబ్లెయిర్‌కు 29 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఈ విమానానికి ఏడేళ్ల క్రితమే కాలం చెల్లింది. అలాగే గల్లంతవడానికి వారం రోజుల ముందే 3 సార్లు మరమ్మతులకు గురైంది.

మరిన్ని వార్తలు