తప్పిపోయిన 18 ఏళ్లకు.. ఇంటికి శవం చేరింది!!

20 Aug, 2014 15:55 IST|Sakshi
తప్పిపోయిన 18 ఏళ్లకు.. ఇంటికి శవం చేరింది!!

జమ్ము కాశ్మీర్లోని సియాచిన్ ప్రాంతంలో ఎప్పుడో 18 ఏళ్ల క్రితం తప్పిపోయిన ఓ సైనికుడు.. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంటికి మృతదేహం రూపంలో చేరాడు. ఉత్తరప్రదేశ్లోని అతడి ఇంటికి మృతదేహాన్ని పంపినట్లు పోలీసులు తెలిపారు. 15 రాజపుత్ర రెజిమెంటుకు చెందిన హవల్దార్ గయా ప్రసాద్ 1996లో సియాచిన్ గ్లేసియర్ ప్రాంతం వద్ద తప్పిపోయాడు.

అతడి మృతదేహం గ్లేసియర్ సాధారణ ప్రాంతంలో మంచు కింద కప్పబడిపోయి ఉండి కొన్ని రోజుల క్రితం కనిపించిందని, దాన్ని 18 ఏళ్ల తర్వాత స్వాధీనం చేసుకున్నామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అతడి స్వస్థలమైన ఉత్తర ప్రదేశ్లోని మైన్పురి ప్రాంతానికి మృతదేహాన్ని పంపామన్నారు. ఈ ప్రాంతంలో చాలా తక్కువ ఉష్ణోగ్రత ఉండటంతో మృతదేహం ఇన్నేళ్లయినా ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉందని చెప్పారు. సాధారణంగా ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ 45 డిగ్రీలుంటుంది. శీతాకాలంలో అయితే మరింత తక్కువగా ఉంటాయి.

మరిన్ని వార్తలు