ఆ టూరిస్ట్‌ కథ విషాదాంతం

21 Apr, 2018 11:32 IST|Sakshi
లిగా స్కోమన్‌, ఆమె సోదరి (ఫైల్‌ ఫోటో)

సాక్షి, తిరువనంతపురం: ఇటీవల కనిపించకుండా పోయిన విదేశీ మహిళ చివరికి శవమై తేలింది. ఐర్లాండ్‌ నుంచి వచ్చిన లిగా స్కోమన్‌ (33) మృతదేహాన్ని  కరమనా నది ఒడ్డున పోలీసులు కనుగొన్నారు. డిప్రెషన్ వ్యాధితో బాధపడుతూ కేరళలోని ఆయుర్వేద కేం​ద్రానికి  చికత్సకోసం వచ్చిన ఆమె   మార్చి నెల14నుంచి  అదృశ్యమయ్యారు.   అయితే వైద్యంకోసం వచ్చిన ఆమె చివరికి ప్రాణాల్నే కోల్పోవడం బాధిత కుటుంబంలో విషాదాన్ని నింపింది. 

ముక్కలు చేసిన  ఆమె మృతదేహాన్ని కనుగొన్నామని తిరువనంతపురం పోలీసు కమిషనర్ పి ప్రక్షేపణ వెల్లడించారు.  నది ఒడ్డుకు సమీపంలోని పొదలలో ఉన్న బాడీ గురించి జాలర్లు తమకు సమాచారం అందించారని  చెప్పారు.  కుళ్లిపోయిన స్థితిలో మొండాన్ని, మరి కొంచెం దూరంలో తలను కొనుగొన్నామన్నారు.  నెలరోజుల క్రితమే చనిపోయి వుంటారని భావిస్తున్నామన్నారు. అయితే దృవీకరణకోసం  డీఎన్‌ఏ  పరీక్ష  నిర్వహించనున్నట్టు  తెలిపారు.

కాగా తన భార్య కనిపించడం లేదంటూ  బాధితురాలి భర్త ఏండ్రూ జోర్డాన్ గత నెలలో ఫిర్యాదు చేశారు.  లాటివన్ పాస్ పోర్టు కలిగిన లిగా గత ఫిబ్రవరి 21 న తన సోదరి ఇల్జే స్క్రోమనే తో బాటు తిరువనంతపురం వచ్చారనీ, తన భార్య గురించి సమాచారం తెలియజేసినవారికి లక్ష రూపాయల రివార్డు ఇస్తామని ప్రకటించారు. తన భార్యను ఎవరైనా  కిడ్నాప్ చేసి ఉంటారనే  అందోళన కూడా వ్యక్తం చేశారు. మరోవైపు  ఈ కేసు దర్యాప్తు  కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు