మానవత్వాన్ని చాటుకున్న మిజోలు

30 May, 2020 15:45 IST|Sakshi

ఐజ్వాల్‌: మిజోరాం ముఖ్యమంత్రి జోరాంథంగా ట్వీటర్‌లో షేర్‌ చేసిన ఒక వీడియో మానవత్వం అంటే ఏంటో చాటిచెబుతోంది. కష్టంలో ఉన్న తోటి వాళ్లకు అండగా నిలిచేవారు చాలా మంది ఉన్నారని నిరూపిస్తోంది. 33 సెకన్ల నిడివిగల ఈ వీడియోలో మిజోరాం ప్రత్యేక రైళ్లో ఇళ్లకు తిరిగి వెళుతున్న కొంత మంది ప్రయాణీకులు అస్సాం వరదల కారణంగా ఆహారం లేక బాధపడుతున్న వారికి ఆహారాన్ని అందించారు. దీనికి సంబంధించి వాట్సప్‌ వీడియోని మిజోరాం ముఖ్యమంత్రితో పాటు చాలా మంది వారి వారి సోషల్‌ మీడియా అకౌంట్లలో షేర్‌ చేస్తోన్నారు. (అస్సాంలో లు..ఐదుగురి మృతి)

జోరాంథంగా ఈ వీడియోని పోస్ట్‌ చేసి ‘ఈ కింది వైరల్‌ వాట్సప్‌ వీడియోలో బెంగుళూరు నుంచి మిజోరాం వస్తున్న మిజోలు మార్గం మధ్యలో వారి ఆహారపదార్థాలను వరద కారణంగా తిండి లేక ఇబ‍్బంది పడుతన్న వారితో పంచుకున్నారు’ అని ట్వీట్‌ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ వీడియో చూస్తుంటే మానవత్వం బతికే ఉందని అర్థమవుతుందని ఒక నెటిజన్‌ కామెంట్‌ చేయగా, వారి మానవత్వానికి నా సెల్యూట్‌ అంటూ మరోకరు కామెంట్‌ చేశారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియో మిజోల గొప్ప మనసు ఏంటో యావత్‌ దేశానికి చాటి చెబుతోంది. 

(అస్సాంలో ఆఫ్రికన్ ఫ్లూ లం)

మరిన్ని వార్తలు