శివసేనపై ఎంఎన్‌ఎస్‌ మండిపాటు

22 May, 2020 14:53 IST|Sakshi

శానిటరీ నాప్కిన్స్‌పై ఆదిత‍్య ఠాక్రే ఫోటో

ముంబై : శివసేన పార్టీ కార్యకర్తలు ఆదిత్య ఠాక్రే ఫోటో ముద్రించిన శానిటరీ న్యాప్కిన్స్‌ను పంపిణీ చేయడం పట్ల పాలక పార్టీపై రాజ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) అభ్యంతరం వ్యక్తం చేసింది. మహా వికాస్‌ అఘది ప్రభుత్వంలో శివసేన చీఫ్‌, ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే  పర్యావరణ, పర్యాటక శాఖ మంత్రిగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. శివసేన కార‍్యకర్తలు ఆదిత్య ఠాక్రే ఫోటో ముద్రించిన 500 ప్యాకెట్ల శానిటరీ న్యాప్కిన్స్‌ను కొలబా అసెంబ్లీ నియోజకవర్గంలోని మహిళలకు పంచారని సీనియర్‌ ఎంఎన్‌ఎస్‌ నేత సందీప్‌ దేశ్‌పాండే ఆరోపించారు.

శివసేన యువజన విభాగం యువతి, యువసేన కార్యకర్తలు వీటిని పంపిణీ చేశారని దేశ్‌పాండే ట్వీట్‌ చేశారు. ఆదిత‍్య ఠాక్రే యువ సేన అధ్యక్షుడిగానూ వ్యహరిస్తుండటం గమనార్హం. కాగా కరోనా వైరస్‌తో ముంబై నగరం విలవిలలాడుతోంది. దేశ ఆర్థిక, వినోద రాజధానిలో ఇప్పటివరకూ 23,935 కోవిడ్‌-19 కేసులు నమోదవగా 841 మంది మరణించారు.

చదవండి : మండలికి ఠాక్రే: ఎన్నిక ఏకగ్రీవం..!

మరిన్ని వార్తలు