వారి సమాచారం అందిస్తే రూ.5,555 బహుమానం

28 Feb, 2020 13:53 IST|Sakshi

ముంబై: దేశంలో అక్రమ చొరబాటుదారులను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం ద్వారా చొరబాటుదారులను గుర్తించి వారిని వారి స్వస్థలాలకు పంపించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన మరో అడుగు ముందుకేసి ఒక కీలక ప్రకటన చేసింది. పార్టీ అధినేత రాజ్‌థాక్రే ఫోటోతో ఔరంగబాద్‌లో కొన్ని పోస్టర్లు వెలిశాయి. మహారాష్ట్ర నవనిర్మాన్‌ సేన విద్యార్థి సంఘం నాయకుడు అఖిల్‌ చిత్రీ పేరుతో ఈ ప్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేశారు.  చదవండి: ‘నా ముస్లిం సోదరులే నన్ను కాపాడారు’

ఎవరైనా సరే వారు నివాసం ఉండే పరిసర ప్రాంతాల్లో పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా వలసవచ్చిన వారిని గుర్తించి సమాచారం అందిస్తే రూ. 5,555 బహుమానం ఇవ్వనున్నట్లు ప్రకటనలో తెలిపారు. వివరాలు అందించిన వారి పేర్లను కూడా రహస్యంగానే ఉంచనున్నట్లు పేర్కొన్నారు. బీజేపీ దగ్గరవుతున్నట్లు కనిపిస్తున్న ఎంఎన్‌ఎస్‌ పార్టీ ఈ ప్రకటనలు, పోస్టర్లు అతికించడం ఉత్కంఠ రేపుతోంది. కాగా ఇదివరకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ఠాక్రే ఇంటికి సమీపంలో చొరబాటు దారులున్నారని.. వారిని ప్రభుత్వం గుర్తించాలంటూ పోస్టర్లు ఏర్పాటు చేశారు.  చదవండి:  ‘కేజ్రీవాల్‌కు డబుల్‌ పనిష్‌మెంట్‌’ 

మరిన్ని వార్తలు