‘నా కొడుకు తప్పు చేసి ఉంటే.. తప్పకుండా శిక్షించాలి’

7 Dec, 2018 16:39 IST|Sakshi

లక్నో : ఉత్తర్‌ప్రదేశ్‌లో బులంద్‌షహర్‌లో చెలరేగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అధికారి సుబోధ్‌కుమార్‌ సింగ్‌ కేసు కీలక మలుపు తిరిగింది. ఇప్పటి వరకు ప్రధాన నిందితుడు యోగేశ్‌ రాజ్‌, సుబోధ్‌పై కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానించారు. తాజాగా.. జమ్ముకశ్మీర్‌కు చెందిన జవాను జీతు ఫ్యూజి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా మారాడు. శ్రీనగర్‌కు చెందిన జీతు ఇన్‌స్పెక్టర్ సుబోధ్‌పై కాల్పులు జరిపినట్లు సమాచారం. ఘటన జరిగిన రోజు ఫ్యూజి అక్కడే ఉన్నట్లు.. అనంతరం అదే రోజు సాయంత్రమే శ్రీనగర్‌ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అతడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

బులందషహర్‌ ఘటనలకు సంబంధించి బయటకు వచ్చిన వీడియోల్లో జీతు ఫ్యూజి స్పష్టంగా కనిపించాడు. అతడిని పట్టుకునేందుకు రెండు పోలీసు బృందాలు జమ్ముకశ్మీర్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సుబోధ్‌ హత్య వెనుక కుట్ర కోణం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు బలం చేకూర్చేలా అల్లర్ల సమయంలో సుబోధ్‌ను చంపేయ్యండి అంటూ కొందరు ఆందోళనకారులు అరుస్తున్న వీడియో ఒకటి తాజాగా బయటకొచ్చింది. ఈ ఘర్షణలో మరో యువకుడు సుమిత్‌ కూడా చనిపోయాడు. సుమిత్‌ మృతికి ప్రతీకారంగానే సుబోధ్‌పై దాడి చేసినట్లు ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. కొందరు ఆందోళన కారులు పోలీసులను వెంబడిస్తూ ‘వారి దగ్గర నుంచి తుపాకీలు లాక్కొని వారిని చంపేయండి’ అని అరుస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా ఉంది.

                                                    (జవాన్‌ జీతు ఫ్యూజీ తల్లిదండ్రులు)

పదునైన ఆయుధంతో సుబోధ్‌పై దాడి చేసి ఆ తర్వాత తలపై కాల్చి చంపారు. సుబోధ్‌ చనిపోయిన సమయంలో జీతు అతని ఎదురుగానే ఉన్నట్లు ఓ వీడియోలో కనిపిస్తోంది. అయితే అతన్ని గుర్తు పట్టడంలో జీతు తల్లి తడబుతున్నట్లు తెలుస్తోంది. వీడియోల్లో తన కొడుకును స్పష్టంగా గుర్తించలేకపోయానని తెలిపింది. ఒకవేళ పోలీసులు చెప్పినట్లు తన కొడుకే సుభోద్‌ను హత్య చేసి ఉంటే.. ఢ. మరో కుటుంబ సభ్యుడు మాట్లాడుతూ.. సుభోద్‌ సింగ్‌ మరణించిన రోజున జీతు ఘర్షణ జరిగిన ప్రాంతంలోనే ఉన్నాడని తెలిపారు. అక్కడి నుంచి ఇంటికి వచ్చి ‘డ్రామా చూశారా’ అంటూ ప్రశ్నించాడని గుర్తు చేసుకున్నారు. అనంతరం సాయంత్రం కార్గిల్‌ వెళ్లాడని తెలిపారు.

మరిన్ని వార్తలు