జైపూర్‌లో ఇంటర్నెట్‌ నిషేధం పొడిగింపు

4 Jul, 2019 18:44 IST|Sakshi

జైపూర్‌ : జైపూర్‌లోని శాస్రి నగర్‌లో సోమవారం ఓ వ్యక్తి ఏడేళ్ల బాలికను అపహరించి అత్యాచారం చేయడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనతో అక్కడ పరిస్థితులు ఉధృతంగా మారాయి. అయితే నగరంలో మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని శుక్రవారం వరకు పొడిగించినట్లు డివిజనల్‌ కమిషనర్‌ కేసీ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవకుండా, శాంతి భద్రతలు అదుపు తప్పకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్‌ వెల్లడించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అదనపు పోలీసు బలగాలను మోహరించామని పేర్కొన్నారు.

రామ్‌గంజ్‌, గాల్టా గేట్‌, మనక్‌ చౌక్‌, సుభాష్ చౌక్‌, బ్రహంపూర్‌, నహర్‌గర్‌, కొత్వాలి, సంజయ్‌ సర్కిల్‌, శాస్రి నగర్‌, భట్టా బస్తీ, లాల్‌ కోతి, ఆదర్శ్‌ నగర్‌, సదర్‌ ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 10గంటల వరకు ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోతాయని ఆయన స్పష్టం చేశారు. కాగా, అత్యాచారానికి గురైన ఏడేళ్ల బాలికకు జైపూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స జరుగుతున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు