బ్లాడర్‌‌లో కేబుల్ : నిజం తెలిస్తే షాక్!

5 Jun, 2020 15:26 IST|Sakshi

హెడ్‌ఫోన్ కేబుల్‌  మింగేశాడు.. కాదు..

మనషుల మానసిక రుగ్మతకు, వింత ప్రవర్తనకు నిదర్శనమైన ఉదంతం ఒకటి అసోంలో వెలుగు చూసింది. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న వ్యక్తికి ఆపరేషన్ చేసిన  వైద్యులు అతని మూత్రాశయంలో మొబైల్  హెడ్ ఫోన్  వైర్ ను  చూసి విస్తుపోయారు.  చివరికి ఆ కేబుల్ ను తొలగించి  రోగి ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. 

ఈ ఘటన పూర్వాపరాలను పరిశీలిస్తే అసోంకు చెందిన రోగి (30) తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరాడు. పొరపాటున హెడ్‌ఫోన్ కేబుల్‌ను మింగేశానని చెప్పాడు.  దీంతో మల పరీక్ష, ఎండోస్కోపీ  పరీక్షలు చేసిన వైద్యులు, ఫలితం లేకపోవడంతో శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. అయినా జీర్ణాశయంలో కేబుల్ జాడ దొరకలేదు. దీంతో ఆశ్చర్యపోయిన వైద్యులు ఆపరేషన్ బెడ్ మీదే ఎక్స్ రే పరీక్ష నిర్వహించారు. ఇక్కడే డాక్టర్లకు దిమ్మదిరిగే విషయం తెలిసింది. రోగి మూత్రాశయం లోపల దాదాపు రెండు అడుగుల పొడవైన కేబుల్‌ను గుర్తించారు. అతడు వైద్యులకు అబద్దం చెప్పాడనీ నోటి ద్వారా కాకుండా పురుషాంగం ద్వారా కేబుల్ చొప్పించబడిందని తేలిందని  సర్జన్ డాక్టర్ వాలియుల్ ఇస్లాం వెల్లడించారు.

“యురేత్రల్ సౌండింగ్'' అని పిలిచే ఒక రకమైన హస్త ప్రయోగమని,  ఇది చాలా అరుదైన విషయమని పేర్కొన్నారు. ఐదు రోజుల తర్వాత నొప్పితో తమ దగ్గరకు వచ్చిన వ్యక్తి  ఇలా  అబద్ధం చెబుతాడని అస్సలు ఊహించలేదన్నారు. తన పాతికేళ్ల చరిత్రలో ఆపరేషన్ టేబుల్ మీద ఇలా జరగడం ఇదే మొదటిసారని ఆయన చెప్పారు. ఈ సంగతి ముందే చెప్పి ఉంటే.. ఆపరేషన్ లేకుండానే కేబుల్‌ను తొలగించేవారిమని చెప్పారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా