వంద శాతం సీట్లు బీజేపీకే కట్టబెట్టాలి

25 Feb, 2017 02:13 IST|Sakshi
వంద శాతం సీట్లు బీజేపీకే కట్టబెట్టాలి

యూపీ ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి
గోండా(యూపీ): ‘‘ఈ ఎన్నికల్లో ఒక్క తప్పునకు కూడా తావు ఇవ్వొద్దు. బీఎస్‌పీ, ఎస్‌పీ పార్టీ ఏదైనా ఒక్క సీటు కూడా వారికి దక్కనివ్వొద్దు. వంద శాతం సీట్లను బీజేపీకే కట్టబెట్టాలి’’అని ఉత్తరప్రదేశ్‌ ప్రజలను ప్రధాని మోదీ కోరారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత మహారాష్ట్రతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడాన్ని ఆయన ప్రస్తావించారు. శుక్రవారం ఇండో–నేపాల్‌ సరిహద్దులకు సమీపంలోని గోండా ప్రాంతంలో ఎన్నికల ప్రచార సభలో  మోదీపాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. ‘‘గురువారం మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అక్కడ కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోయింది. ఒడిశా, మహారాష్ట్ర, చండీగఢ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలైనా లేదా గుజరాత్‌లోని పంచాయతీ ఎన్నికలైనా గత మూడు నెలల్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజలు తమ మూడో కన్నుతో చూసి బీజేపీకి ఘనవిజయాన్ని కట్టబెట్టారు.’ అని అన్నారు. 150 మంది ప్రాణాలు బలి తీసుకున్న కాన్పూర్‌ రైలు ప్రమాదం ఘటన వెనుక కుట్ర ఉందని, సరిహద్దుల అవతల నుంచి కుట్రకు పాల్పడ్డారనేందుకు ఆధారాలు లభించాయని మోదీ చెప్పారు.

మరిన్ని వార్తలు