వైద్య సిబ్బందికి.. రూ.50 లక్షల కరోనా బీమా

5 Jul, 2020 02:17 IST|Sakshi

ప్రైవేటులో పనిచేసే వారికీ వర్తింపు

ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం

సాక్షి, హైదరాబాద్‌: కరోనా విధులు నిర్వహిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి రూ.50 లక్షల బీమా పథకాన్ని అమలు చేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజనలో భాగంగా దీన్ని అమలు చేస్తున్నట్లు కేంద్రం ఇదివరకు ప్రకటించగా తాజాగా మార్గదర్శ కాలు విడుదల చేసింది. కరోనాతో మరణిస్తే కరోనా సంబంధ విధుల్లో ప్రమాదకర స్థితిలో మరణిస్తే ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్యులు, సిబ్బంది, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులతోపాటు ప్రైవేటు ఆస్పత్రుల్లోని వైద్యులు, సిబ్బందికీ పథకం వర్తించనుంది. అయితే ఈ మరణాలను రాష్ట్ర, జిల్లా స్థాయి లోని కమిటీలు నిర్ధారించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఈ పథకం కింద బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తారు. 

మరిన్ని వార్తలు