ఏటా 20 ఈఎల్స్‌ వాడాల్సిందే!

5 Jan, 2019 03:43 IST|Sakshi

త్వరలో కేంద్రం ఉత్తర్వులు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై ఏడాదిలో 20 ఎర్న్‌›్డ లీవులు(ఈఎల్స్‌–ఆర్జిత సెలవులు) తప్పనిసరిగా వాడుకోవలసి ఉంటుంది. పదవీ విరమణ సమయంలో అదనపు భత్యం కింద వీటిని దాచుకోవడానికి ఇకపై వీలుండదు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదికి 30 ఈఎల్‌లు ఉంటాయి. ఇకపై ఏడాదికి పది ఈఎల్స్‌ మాత్రమే తర్వాతి సంవత్సరం సెలవుల్లో కలుస్తాయని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేయనుంది. అంటే మిగతా 20 సెలవులను వాడుకోకుంటే వృథా అవుతాయి. ప్రభుత్వ బ్యాంకులు గత ఏడాది చివరి నుంచే ఈ పద్ధతిని అమలు చేస్తున్నాయి. తమ సిబ్బందిని కచ్చితంగా పది రోజులు సెలవుపై పంపుతున్నాయి. 2019–20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో 3.5 కోట్ల ప్రభుత్వ ఉద్యోగుల భత్యాల చెల్లింపు కోసం దాదాపు రూ.63,232 కోట్లు కేటాయించింది.

మరిన్ని వార్తలు