మోదీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు

25 Dec, 2017 08:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దేశ ప్రజలకు క్రిస్మస్‌ పర్వదిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రిస్మస్‌ సమాజంలో  సుఖశాంతులు తీసుకురావాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ రోజే పుట్టినరోజు జరుపుకుంటున్న మాజీ ప్రధానమంత్రి అటల్‌ బీహారీ వాజ్‌పేయికి శుభాకాంక్షలు తెలిపారు. 

ప్రపంచం దేశాల ముందు భారత్‌ ఉన్నత స్ధానంలో నిలవడానికి వాజ్‌పేయి దూరదృష్టే కారణమని కొనియాడారు. ఇదే రోజున జన్మించిన పండిట్‌ మదన్ మోహన్‌ మాళవీయను కూడా మోదీ గుర్తు చేసుకున్నారు. భారత చరిత్రపై మాళవీయ వేసిన ముద్ర ఎన్నటికీ చెరిగిపోనిదని అన్నారు. విద్యా రంగం కోసం ఆయన చేసిన సేవలు మరువలేనివని చెప్పారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు