మోదీ పిరికిపంద.. సైకో: కేజ్రీవాల్

15 Dec, 2015 11:26 IST|Sakshi
మోదీ పిరికిపంద.. సైకో: కేజ్రీవాల్

అవినీతి ఆరోపణలతో ఢిల్లీ సచివాలయంలో సీబీఐ సోదాలు చేయడంతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ తీవ్రంగా మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని పిరికిపంద, సైకో అంటూ అభివర్ణించారు. సీబీఐ అబద్ధాలు ఆడుతోందని, తన సొంత కార్యాలయంలోనే దాడులు జరిగాయని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సీఎం కార్యాలయంలోని ఫైళ్లను వాళ్లు తనిఖీ చేస్తున్నారని, మోదీకి ఏ ఫైలు కావాలో చెప్పాలని అన్నారు.

రాజేంద్రకుమార్ వంక పెట్టుకుని తన కార్యాలయంలోని మొత్తం అన్ని ఫైళ్లను తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. అవినీతి ఆరోపణలు రాగానే ఒక మంత్రిని, మరో సీనియర్ అధికారిని తనంతట గానుగా డిస్మిస్ చేసిన ఏకైక ముఖ్యమంత్రిని తానేనని, వాళ్ల కేసులను సీబీఐకే అప్పగించానని గుర్తు చేశారు. సీబీఐకి రాజేంద్ర కుమార్ మీద ఏవైనా సాక్ష్యాలు లభిస్తే వాళ్లు ఆ విషయాన్ని తనకు ఎందుకు చెప్పలేదని.. అలా చెబితే వాళ్లపై తానే చర్యలు తీసుకునేవాడిని కదా అని కేజ్రీవాల్ అన్నారు.

 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు